తెనాలి పోలీసులది తప్పే.. కానీ జగన్ నాకు చేసిందేంటి ? రఘురామ ప్రశ్న..!
Tue Jun 03, 2025 18:29 Politics
తెనాలి పోలీసుల దాడిలో గాయపడ్డ బాధితుల కుటుంబాల్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లడంపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. తెనాలి పోలీసులు బహిరంగంగా వారిని కొట్టడాన్ని తప్పుబట్టిన రఘురామ.. అదే సమయంలో గతంలో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు తనపై చేయించిన దాడిపై ప్రశ్నించారు. గతంలో జరిగిన పలు ఘటనల్ని ఆయన గుర్తుచేశారు.
ఇవాళ తెనాలిలో ఓ గమ్మత్తైన ఘటన జరిగిందని, జగన్ అక్కడ పర్యటించారని రఘురామ తెలిపారు. రౌడీ షీటర్లుగా పేరు పొందిన జాన్ విక్టర్, అతని గ్యాంగ్ పై పలు కేసులు జగన్ హయాం నుంచే ఉన్నాయని వెల్లడించారు. గంజాయి బ్యాచ్, చైన్ బ్యా్ అని వీరికి బిరుదులు కూడా ఉన్నాయన్నారు. తెనాలిలో పేరున్న గంజాయి ముఠాగా విశిష్టమైన ప్రాధాన్యం ఉన్న రౌడీలు ఓ బీసీ హెడ్ కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేశారని ఆరోపించారు.
ఓ హెచ్ కానిస్టేబుల్ మీదే గంజాయి బ్యాచ్ దురాగతం చేస్తే ప్రజల్లోనూ అవగాహన రావాలని రఘురామ తెలిపారు. వీరు జైలుకు వెళ్లడం, తిరిగి రావడం అలవాటుగా మారిపోయిన వారికి ఏ శిక్ష విధించినా తప్పు లేదన్నారు. ఇలాంటి సమయంలోనే చట్టం, న్యాయం వంటివి తెరపైకి వస్తాయన్నారు. అయితే బహిరంగంగా ఇలా చేయడం చట్టానికి వ్యతిరేకమే అన్నారు. గతంలో డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపై కొట్టించిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి అన్నారు.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
సుబ్రమణ్యాన్ని పార్శిల్ చేసిన వ్యక్తికి మద్దతిచ్చిన వ్యక్తి కూడా అన్నారు. అలాంటి వారికి మద్దతు తెలిపేందుకు మాజీ సీఎంగా పనిచేసిన వ్యక్తి గత చరిత్ర చూసినా ఎంపీగా సొంత పార్టీలో ఉన్న తాను సలహా ఇచ్చినందుకు అన్యధా భావించి దారుణంగా చిత్ర హింసలు చేశారన్నారు. దాంతో పోలిస్తే రోడ్డుపై వీరిని కొట్టడం నథింగ్ అన్నారు. తనను ఎంత చిత్రవథ చేశారో అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్లు తనను కొట్టారన్నారు.
ఇప్పుడు దారుణమైన గంజాయి బ్యాచ్ ను పోలీసులు కొడితే తగుదునమ్మా అంటూ జగన్ వెళ్లడం ఏంటన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాకపోయినా ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలా గంజాయి బ్యాచ్ కు మద్దతునివ్వడం దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట అన్నారు. దీని వల్ల గతంలో వచ్చిన ఓట్లు కూడా రాకుండా పోతాయన్నారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయన్నారు. ఓ రాజకీయ నాయకుడు ప్రజా కంటకంగా తయారైన క్రిమినల్స్ పోలీసులు ధర్మం ప్రకారం శిక్షిస్తే ఇలాంటి వెధవలకు తాను ఉన్నానంటూ భుజం తట్టడం ఆత్మహత్యాసదృశ్యం అన్నారు.
జగన్ పరామర్శించిన జాన్ విక్టర్ ఎస్సీ కాదని, బీసీ సీ అవుతాడని రఘురామ తెలిపారు. ఇతన్ని దళితుడి పేరుతో జగన్ రెచ్చగొడుతున్నారన్నారు. తనను దారుణంగా హింసించిన వ్యక్తులు ఏమీ చేయలేదని తప్పించుకునేందుకు చూస్తున్నారన్నారు. తనపై దాడి చేసిన సునీల్ కుమార్ ను ఇప్పటివరకూ పిలిచి విచారించకపోవడం సముచితం కాదన్నారు. చట్టం పరిధి ఎక్కువ కాబట్టి ఆలస్యమైనా న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు.
ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #RaghuramaQuestions #TenaliPoliceIssue #RaghuramaVsJagan #APPolitics #PoliticalControversy #YSJagan
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.